ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చాక కీలక మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారుల బదిలీలు జరుతున్నాయి. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని మార్చే యోచనలో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. కొత్త సీఎస్ గా విజయానంద్ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మరో ఉత్తర్వులను జారీ చేశారు.
టీచర్లకు సంబంధించి ఎటువంటి బదీలీలు చేపట్టవద్దని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు మొత్తం 1800 మంది టీచర్లను బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఒత్తిడితో ఈ సిఫారసులు జరిగాయని అభియోగం ఉంది. గతంలో ఇచ్చినటువంటి బదిలీ ఉత్తర్వులను నిలిపివేశారు. టీచర్ల బదిలీలు చేపట్టవద్దని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి బదిలీలు చేపట్టవద్దని.. ఇందుకు సపరేట్ ఓ జీవో కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.