ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కల్వర్టును కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జైనూర్ మండలంలోని జన్‌గావ్ గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాగర్ కథనం ప్రకారం..జిల్లా కేంద్రానికి చెందిన మల్లూరి శ్రీనివాస్ (36) మహారాష్ట్రలోని పన్డంపూర్‌కు దైవ దర్శనానికి కారులో వెళ్లి వస్తున్నాడు.
ఈ క్రమంలో నేటి ఉదయం జన్ గావ్ గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. దీంతో మల్లూరి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందారు.గాయపడిన మరో ముగ్గురిని స్థానికులు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో కారు డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.