ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబైలో కేసు నమోదు

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదు అయింది. రాజాసింగ్ పై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 29న ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపిసి153a1(ఎ) కింద కేసు నమోదు చేశారు. కాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకుగాను హైదరాబాద్ పోలీసులు సైతం రాజాసింగ్ గతంలో నోటీసులు ఇచ్చారు.

రాజా సింగ్ కు బెయిల్ ఇచ్చిన సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ హైకోర్టు షరతు విధించిన సంగతిని హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నోటీసులలో గుర్తు చేశారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. మరోవైపు ఫిబ్రవరి 19న జరిగిన చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న సమయంలో కూడా ఆయనపై కేసు నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version