హైదరాబాద్ లో మరో విషాదం.. ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని కూతుర్ని చంపిన తండ్రి

-

హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో దారుణం.. చోటు చేసుకుంది. సెల్ఫోన్ మాట్లాడుతుందని కూతుర్ని చంపేశాడు ఓ  పిన తండ్రి. ముషీరాబాద్ పీఎస్ పరిధిలో  కూతురుని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు పిన తండ్రి. ఫోన్ మాట్లాడవద్దంటూ ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో  హత్య చేశాడు.

 

మృతి చెందిన అమ్మాయి యాస్మిన్ ఉన్నిసా (17) కాగా పిన తండ్రి సాదిక్ గా గుర్తించారు. యాస్మిన్ తల్లిని రెండో వివాహం చేసుకుఎన్నడూ పిన తండ్రి సాదిక్.

ఈ ఘటన ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారంలో చోటుచేసుకుంది. కూతురిని చంపిన అనంతరం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు నిందితుడు మహమ్మద్ తౌ ఫి అలియాస్ సాదిక్. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version