ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్

-

ఎయిర్‌ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు. ఎయిర్‌ ఇండియా విమానంలో హైడ్రాలిక్‌ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నారని చెప్పారు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎయిర్ ఇండియా విమానం ఏఐ-951 (హైదరాబాద్-దుబాయ్)లో ఈ ఘటన చోటుచేసుకుంది. అందులో 143 మంది ప్రయాణికులు ఉన్నారు.

కాగా ఇలాంటి ఘటనే ఈ నెల 2న కూడా జరిగింది. డిసెంబర్‌ 2న కన్నౌర్‌ నుంచి దోహా వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తటంతో, విమానాన్ని ముంబైకి మళ్లించారు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ఘటన మధ్యలోనే జరిగిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, దానిని బేలోకి లాగుతున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version