సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అని రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. మొదటి భార్య సడెన్‌ ఎంట్రీ !

-

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ అని రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ భర్త. అయితే, అంతలోనే మొదటి భార్య సడెన్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పి రెండో పెళ్లికి సిద్ధపడిన వ్యక్తిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నం కు చెందిన షేక్ సుభాని గుంటూరుకు చెందిన యువతి కుటుంబానికి తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినని చెప్పి మోసగించి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా, సుభాని మొదటి భార్య యువతి తల్లిదండ్రులకు సుభాని మోసాన్ని తెలియజేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు. మాయమాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను పోలీసులు కోరారు. మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version