చిరు కూతురు శ్రీజ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటి..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న ఈయన మిగతా భాషా సినీ ఇండస్ట్రీలో కూడా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక రాజకీయంగా కేంద్రంలో కూడా పనిచేసిన ఈయన రాజకీయాలలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల మాత్రం అందరి చూపు చిరంజీవి కుటుంబం పైనే పడిందని చెప్పాలి. ఎందుకంటే తాజాగా ఉపాసన కామినేని పిల్లలు కనడం గురించి సద్గురుని అడగడంతో అక్కడ జరిగిన విషయాలన్నీ ఆమెను విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఈ విషయం గురించి పెద్దగా ఎవరు పట్టించుకోకపోయినా ఇప్పుడు మళ్ళీ ఈ కుటుంబం పై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేమిటంటే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మూడో వివాహం చేసుకోబోతోంది అనే వార్తలకు మరింత రూమర్స్ క్రియేట్ అవుతూ ఉండడం గమనార్హం.

ఇక ఈ విషయంపై ప్రముఖ సీనియర్ నటి పూజిత స్పందించారు.. పూజిత మాట్లాడుతూ చిరంజీవి గారు సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తి. కానీ ఆయన కూతురు శ్రీజ మాత్రం ఇలా మూడో పెళ్లి చేసుకుని ఆయన పరువు కూడా తీస్తోంది. ఆమె బిహేవియర్ ఏమాత్రం పద్ధతిగా లేదు అంటూ తెలిపింది. ఇక చాలా గారాబంగా పెరగడం వల్లే శ్రీజ ఎవరితో కూడా అడ్జస్ట్ కావడం లేదు అంటూ తెలిపింది పూజిత.. ఇక నిజానికి తన తండ్రికి తెలియకుండా ఆర్య సమాజంలో ఒక అబ్బాయిని వివాహం చేసుకున్న శ్రీజ, ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత అతడితో విడాకులు తీసుకుంది. ఇక చిరంజీవి సలహా మేరకు కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకున్న ఈమె మరొక పాపకు జన్మనిచ్చింది. ఇప్పుడు అతడితో కూడా విడాకులు తీసుకొని.. మూడో వివాహం చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి వాళ్ల కుటుంబ విషయాలు నాకు పెద్దగా తెలియవు.. కాబట్టి ఇంతవరకే మాట్లాడగలను అంటూ ఒకపక్క పూజిత చెబుతూనే మరొక పక్క తన తండ్రి పరువు గురించి ఆలోచించి మూడవ పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటూ ఆమె తెలిపింది. మొత్తానికి అయితే శ్రీజ పైన పూజిత చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version