నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం పై చర్చించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి మనోహల్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నికర జలాల కేటాయింపు తరువాత ఏదైనా ప్రాజెక్ట్ కి అనుమతివ్వాలని కోరినట్టు తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపులే పూర్తి కాలేదు. తెలంగాణకు జలాలలో అన్యాయం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నీటిని అక్రమంగా వాడుకుంటోంది. వాటికి అడ్డుకట్ట వేయాలని కేంద్ర మంత్రిని కోరాం. మంత్రి కూడా సానుకూలంగా స్పందించారు. ఏపీ ఇష్టానుసారంగా నీటిని వాడుకోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.