యువతిపై 4 గురు మైనర్లు గ్యాంగ్ రేప్..గెస్ట్ హౌజ్ కు తీసుకువెళ్లి మరీ !

-

ఇండియాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా.. మహిళలపై రేప్‌లు, హత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజూ ఏదో ఓ మూలన మహిళలపై దాడులు చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక నిన్న ఉగాది పర్వదినం రోజున కూడా దేశ రాజధానిలో గ్యాంగ్‌ రేప్‌ జరిగింది. నలుగురు మైనర్లు.. ఓ 26 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలేఖ్య అనే యువతి.. ఎప్పటి లాగే.. నిన్న ఆఫీసు కు వెళ్లింది. తన పని ఫినిష్‌ కాగానే.. ఇంటికి వెళ్లింది. అయితే.. ఆమె వెళ్లే మార్గంలో.. రాజేష్‌, కార్తీక్‌ అనే ఇద్దరు మైనర్లు ఆమెను బలవంతం చేసి.. అక్కడే ఉన్న పోదల్లో రేప్‌ చేశారు.

అక్కడితో ఆగకుండా.. తమ వాహనంలో ఆ యువతిని గెస్ట్‌ హౌజ్‌ కు తీసుకెళ్లారు. వారి గెస్ట్‌ హౌజ్‌ లో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు హరీష్‌, సత్య నారాయణలు కూడా ఆమె యువతి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫోర్న్‌ వీడియోలు చూపించి మరీ.. ఆమెను రేప్‌ చేశారు. ఈ విషయాన్ని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version