బాలికపై గ్యాంగ్‌ రేప్.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. పదేళ్ల తరువాత

-

చేసిన పాపం ఎప్పటికైనా పండుతుంది. చేసిన తప్పుకు శిక్ష తప్పదు.. ఇందుకు నిదర్శనమే ఈఘటన.. ఒక బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. దీంతో గర్భం దాల్చిన ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చేశారు. అంతేకాకుండా ఆమెకు వెంటనే పెళ్లి చేసిపంపించేశారు. అయితే.. పదేళ్ల తర్వాత గ్యాంగ్‌ రేప్‌ సంగతి తెలిసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు తన తల్లి గురించి తెలుసుకున్న కుమారుడు అసలైన తండ్రి కోసం కోర్టును ఆశ్రయించాడు. దీంతో గ్యాంగ్‌ రేప్‌ నిందితుల్లో ఒక వ్యక్తి అతడి తండ్రిగా డీఎన్‌ఏ టెస్ట్‌లో తేలింది. సినిమా స్టోరీని తలపించేలా ఉన్న ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. 1994లో షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక తన అక్కాబావ ఇంట్లో నివసించింది. ఒక రోజున ఆ ఇంట్లోకి చొరబడిన స్థానికులైన కొందరు యువకులు ఒంటరిగా ఉన్న ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 13 ఏళ్ల వయసులో ఒక బాబుకు జన్మనిచ్చింది.

అయితే ఆమె తల్లిదండ్రులు ఆ బాబును ఒక కుటుంబానికి ఇచ్చారు. ఆ కుటుంబం రాంపూర్‌కు వలసపోయింది. కాగా, ఆ బాలిక తల్లిదండ్రులు ఆమెకు ఒక వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే పదేళ్ల కాపురం తర్వాత భార్యపై గతంలో గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్లు భర్తకు తెలిసింది. దీంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు పెద్దవాడైన ఆ మహిళ కుమారుడు ఆమెను కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరని అడిగాడు. జరిగిన సంగతి ఆ తల్లి చెప్పింది. దీంతో తన తండ్రి ఎవరన్నది అతడు తెలుసుకోవాలనుకున్నాడు. దీనిపై కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై విచారణ జరుపడంతో గ్యాంగ్‌ రేప్‌ నిందితులను గుర్తించారు పోలీసులు. వారికి డీఎన్‌ఏ టెస్ట్‌ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకరైన గుడ్డు 27 ఏళ్ల వ్యక్తి తండ్రిగా తేలింది. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version