ప్రియుడిని ఇరికించేందుకు అత్యాచారం జరిగిందని యువతి డ్రామా..

-

హైదరబాద్ లోని సంతోష్ నగర్ ప్రాంతంలో అత్యాచారం జరిగిందని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన స్టేట్మెంటుని పరిగణలోకి తీసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారం జరిపారని యువతి పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో బయటకు వచ్చిన విషయాలు, పోలీసులకు దిమ్మ తిరిగేలా చేసాయి. 3ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంలో విషయం మొత్తం తేటతెల్లమైంది.

అత్యాచారం అంతా ఒక డ్రామా అని తేలింది. తాను ప్రేమించిన వాడికి వేరొకరితో నిశ్చితార్థం జరిగినందున, అత్యాచారం అయ్యిందని డ్రామా ఆడినట్లు తెలిసింది. ఇదంతా పోలీసుల విచారణలో ఆ యువతి వెల్లడి చేసింది. కిడ్నాప్ సమయానికి, సీసీ ఫుటేజీకి పొంతన లేకపోవడంతో అనుమాన పడ్డ పోలీసులు యువతిని ప్రశ్నించగా ఈ విషయాలను బయటపెట్టింది. ప్రియుడిని ఇరికించేందుకు అత్యాచారం డ్రామా ఆడినట్లు యువతి ఒప్పుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version