ఏపీలోని సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా ఉగాది పండుగ నాడే జిల్లాలోనిి మడకశిరలో ఉంటున్న కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాల్లోకివెళితే.. స్థానిక గాంధీ బజారులో నివాసం ఉంటున్న బంగారం వ్యాపారి కుటుంబం.. సైనైడ్ మింగి బలవన్మరణానికి పాల్పడింది.
దంపతులు కృష్ణాచారి, సరళమ్మతో పాటు కుమారులు సంతోష్, భువనేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నలుగురూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుల్లో సంతోష్ పదో తరగతి, భువనేశ్ ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలే వారి ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.