ఆపరేషన్ మదర్ టైగర్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా పెద్ద గుమ్మాడాపురం అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలను గుర్తించారు అటవీ శాఖ సిబ్బంది. అది మదర్ టైగర్ T108 F అవునా? కాదా? అనే కోణంలో అటవీ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. నాలుగు పులి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని.. ప్రత్యేక వైద్య బృందం చే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
300 మంది సిబ్బంది, 50 మందికి పైగా అటవీ అధికారులతో ఈ ఆపరేషన్ మదర్ టైగర్ చేపట్టినట్లు వివరించారు. శాస్త్రీయంగాను, సాంకేతికంగా తల్లి పులి కోసం గాలిస్తున్నామన్నారు. 200 హెక్టార్లలో 40 ట్రాప్ కెమెరా లతో ట్రేస్ చేస్తున్నామని, అవసరాన్ని బట్టి డ్రోన్ వినియోగిస్తామన్నారు. తల్లిపులి దగ్గరికి పిల్లలను చేర్చడం దేశ చరిత్రలోనే తొలి సారి అన్నారు. నిపుణుల సూచనల మేరకు పులి కూనలకు పాలు, సెరోలాక్ తో పాటు నేడు లివర్ ముక్కలను అందించామన్నారు మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అపావ్.