కీసరలో స్కూటీని ఢీకొట్టిన లారీ.. జనాల వెర్రివేషాలకు నిండుప్రాణం బలి

-

కీసరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చావుబతుకుల్లో ఉన్న వ్యక్తి తనను రక్షించాలని నోరు తెరచి వేడుకున్నా కొందరు జనాల వెర్రివేషాలకు నిండు ప్రాణం బలైంది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించకుండా, కనీసం అంబులెన్సుకు కాల్ చేయకుండా కొందరు ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు. దీంతో ఆ వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందాడు. వివరాల్లోకివెళితే.. హైదరాబాద్ – కీసర ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని రాంపల్లి చౌరస్తా వద్ద వరంగల్ జిల్లాకి చెందిన ఎలందర్ (35) అనే వ్యక్తి తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీ పై వెళ్తున్నాడు.

ఈ క్రమంలోనే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. కిందపడిపోయిన అతని కాళ్ల మీద నుంచి లారీ రివర్స్ చేయడంతో రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి.రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు. కానీ, అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version