కాంగ్రెస్ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్బంగా కొత్తగా నాలుగు పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, నిన్న ప్రతి జిల్లాలోని ఓ మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఓ గ్రామాన్ని ఎంపిక చేసి అందులో లబ్దిదారుల జాబితాను ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు రాలేదని, ఇందిరమ్మ ఇల్లు రావడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని..తనకు న్యాయం జరగదని ప్రభాకర్ అనే వ్యక్తి మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పురుషోత్తం ప్రభాకర్‌ది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని.. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యుల రోదిస్తున్నారు.
మరో కాంగ్రెస్ ప్రభుత్వ హత్య
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని కార్మికుని ఆత్మహత్య
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేరు లేదని.. తనకు న్యాయం జరగదని ప్రభాకర్ మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టం పేట గ్రామానికి చెందిన పురుషోత్తం ప్రభాకర్… pic.twitter.com/I4wf9wSMDE
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2025