
దేశంలో మరోసారి లాక్ డౌన్ పారిణామాలు కనబడుతున్నాయి..! లక్ డౌన్ అంటే ముఖ్యంగా భయపడేది మందుబాబులే. లాక్ డౌన్ అమలు లోకి వస్తే మధ్యం దొరకదు మధ్యం లేకపోతే మందుబాబులకు రోజు గడువదు. కరోనా నేపద్యంలో మహారాష్ట్రలోని ఓ వ్యక్తి మధ్యం దొరకక శానిటైజర్ తాగేశాడు. అనంతరం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర లోని నాగ్‌పూర్ కు చెందిన గౌతమ్ గోస్వామి (45) మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. గౌతమ్ గోస్వామి కి ప్రతీ రోజు మధ్యం సేవించడం అలవాటు. మహారాష్ట్ర లో కరోనా నేపద్యం లో మధ్యం ఎక్కడా దొరకలేదు. దాంతో శానిటైజర్ లో ఆల్కహాల్ శాతం అత్యధికంగా ఉంటుందని తెలిసిన గౌతమ్ శానిటైజర్ ను తాగేశాడు. అతని ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు అతనికి చికిత్స అందించి, ఇంటికి పంపించారు. అయితే రెండు రోజుల తరువాత గౌతమ్ ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.