భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల వారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అర్చకులు సీతాసమేత శ్రీరాముల వారికి విశేష పూజలు చేస్తున్నారు. భద్రాచలం సన్నిధానం మొత్తం జై రామ్ నినాదాలతో మారుమోగుతున్నది.
అయితే, భద్రాద్రి ఆలయంలో కాసేపట్లో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కళ్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలతో భక్తజనం స్వాగతం పలికారు.దీంతో మిథిలా స్టేడియంలో ఉన్న భక్తుల్లో కోలాహలం నెలకొంది.