సొంత జిల్లాలో భట్టి విక్రమార్కకు షాక్ తగిలింది. ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాల అమలులో భాగంగా ఎంపిక చేసిన పైలెట్ ప్రాజెక్టు గ్రామాన్ని మార్చడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మార్వో, ఇతర ప్రభుత్వ అధికారులను ఖానాపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో పెట్టి తాళం వేశారు.
ఖమ్మంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద అధికారులు ఎంపిక చేశారు.ఆ గ్రామంలో కొందరు చొప్పున లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తామని ప్రకటించారు.ముదిగొండ మండలంలో ఖానాపురాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించి తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, ఎంపీఓ వాల్మీకి కిశోర్ ఆధ్వర్యంలో శనివారం నుంచి సర్వే మొదలు పెట్టారు.
2 గంటల పాటు సర్వే చేశాక రాత్రి 9 గంటల సమయంలో మండలంలో పైలట్ గ్రామంగా ఖానాపురం బదులు సువర్ణాపురాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం అందింది. దీంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న అధికారులు అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.దీంతో
ఆగ్రహించిన గ్రామస్తులు తమ గ్రామాన్ని ఎలా రద్దు చేస్తారంటూ కార్యాలయ గేట్లకు తాళం వేశారు. ఈ విషయం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
సొంత జిల్లాలో భట్టి విక్రమార్కకు షాక్ ఇచ్చిన పైలట్ ప్రాజెక్ట్
ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి మండలానికో గ్రామం పైలట్ ప్రాజెక్టు గ్రామాన్ని మార్చడంతో గ్రామస్తుల ఆగ్రహం
ఎమ్మార్వో, మరియు ఇతర ప్రభుత్వ అధికారులను ఖానాపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో పెట్టి తాళం… https://t.co/B97hyyEsKv pic.twitter.com/MzqkmNy5JT
— Telugu Scribe (@TeluguScribe) January 26, 2025