ఉదయం వాకింగ్ చేయడానికి వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. వాకింగ్ ట్రాక్‌ను ఆనుకుని ఉన్న చెట్టుపై పెద్ద పాము పడగవిప్పి ఉన్నది. అది గమనించిన వాకర్స్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటన గురువారం ఉదయం మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ 100 ఫీట్ల రోడ్డులో వెలుగుచూసింది. అక్కడ ఉన్న గన్నేరు చెట్టుపైకి నాగు పాము ఎక్కింది. పడగవిప్పి ఆ రోడ్డులో వచ్చి వెళ్లే వాకర్స్‌కు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దారిలో వెళ్తున్న కొందరు పడగ విప్పి ఉన్న నాగుపామును తమ సెల్ ఫోన్లలో క్లిక్ మనిపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.
చెట్టుపై నాగుపాము.. కంగుతిన్న వాకర్స్
మేడ్చల్ ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లిన వారికి నాగరాజు పడగవిప్పి పలకరించాడు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ 100 ఫీట్ల రోడ్డులో ఉన్న గన్నేరు చెట్టుపైకి నాగు పాము ఎక్కింది. పడగవిప్పి ఆ రోడ్డులో వచ్చి వెళ్లే వాకర్స్‌కు కనిపించడంతో ఒక్కసారిగా… pic.twitter.com/3SDkOMliBb
— ChotaNews App (@ChotaNewsApp) April 17, 2025