కాన్పూర్‌లో వింత పక్షి.. శవాలను పీక్కోని తినే రాబందని స్థానికుల అనుమానం..!

-

రాబందు అనగానే..మనకు శవాలే గుర్తుకువస్తాయి.. ఇవి శవాలనూ పీక్కోని తింటాయని మనకు బాగా తెలుసు. నిజంగా ఇవి పీక్కోని తింటాయా..? లేదా అనేది పక్కన పెడితే.. రాబందులు మీద అందరికీ నెగిటివ్‌ ఒపినీయనే ఉంటుంది. అలాంటి రాబందు ఒకటి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో స్థానికులకు చిక్కింది. దాన్ని చూసి అక్కడి వారంతా భయపడ్డారు..

ఉత్తరప్రదేశ్‌లోని ఈద్గా శ్మశాన వాటికలో ఉన్న తెల్లటి హిమాలయ రాబందును గుర్తించిన స్థానికులు దాన్ని పట్టుకున్నారు. అయితే ఈ రాబందుకు రెక్కలు భారీ పొడవుగా ఉన్నాయి. సుమారు 5.5అఢుగుల పొడవు ఉండటంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు..శ్మశానంలో దొరికిన రాబందు వయసు కూడా వందల ఏళ్లు ఉంటుందని అక్కడి వారు అనుమానిస్తున్నారు.

వయసు రిత్యానే ఈ రాబందు పెద్ద రెక్కలతో ఎగరలేకపోవడం వల్లే ఈ రకంగా జనావాసాల మధ్యకు వచ్చి దొరికిపోయిందని స్థానికులు అంటున్నారు. అయితే ఈ భయానకర పక్షిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ రకం తెల్లటి హిమాలయ రాబందులు అంతరించిపోయాయని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.. చాలా రోజులుగా ఈ రాబందుల జంట శ్మశానంలోనే తిష్టవేసినట్లుగా గుర్తించాడు ఈద్గాలో నివసిస్తున్న సఫీక్ అనే యువకుడు. ఆదివారం మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి పెద్ద పెద్దగా ఉన్న రాబందు రెక్కల ద్వారా దాన్ని పట్టుకున్నట్లుగా వెల్లడించారు..

చూడటానికి భయంకరంగా ఉన్న ఈ రాబందును పట్టుకున్న వార్త నిమిషాల వ్యవధిలో అందరికి తెలిసిపోవడంతో చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తండోపతండాలుగా వచ్చారు. పోలీసుల ఆధీనంలో ఉన్న రాబందును పారెస్ట్ అధికారులకు అప్పగించి ..అది ఏ ప్రాంతానికి చెందినదో..ఇలాంటివి ఎక్కడున్నాయో..కాన్పూర్‌కి ఎలా వచ్చాయో తెలుసుకున్న తర్వాత వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే అక్కడి జనం మాత్రం ఇది ఇప్పటివరకూ శ్మశాన వాటికలో శవాలను పీక్కోని తిన్నదని బలంగా నమ్ముతున్నారు. కొన్ని పక్షలు చూసేందుకు అందంగా ఉంటాయి.. కొన్ని భయంకరంగా ఉంటాయి.. ఇప్పుడు ఈ పక్షి కూడా చూడ్డానికి భయంకరంగా ఉండటంతో జనాలు ఇది శవాలను పీక్కోని తినే రాబందు అని తేల్చేశారు..! అసలు ఇది ఏ జాతి పక్షో, ఎక్కడి నుంచో వచ్చిందో, దాని పేరేంటో ఏం తెలియదు.. ఫారెస్ట్‌ అధికారులు ఈ వివరాలను త్వరలో చెప్తామని తెలిపారు.!

Read more RELATED
Recommended to you

Exit mobile version