రాష్ట్రంలో గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన గురుకులాల్లో వసతుల లేమీ, భోజనం సరిగా లేకపోవడం వంటి అనేక సమస్యలతో విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఖమ్మం జిల్లాలోని ఎస్సీ గురుకుల కాలేజీ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాల్లోకివెళితే..జిల్లాలోని ముదిగొండ గ్రామానికి చెందిన సాయివర్ధన్ కిష్టాపురం ఎస్సీ గురుకుల కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. సోమవారం ఇంటికి వెళ్లి వచ్చిన సాయివర్ధన్ కాలేజీలో రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన కళాశాల సిబ్బంది సాయివర్ధన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.