దొంగతనానికి వచ్చినవాడు… దొంగతనం చేసుకుని పోవాలి. కానీ ఇంత వెర్రీ దొంగ ఉంటాడని ఎవరూ అనుకోలేదు. వైన్ షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్నాడు ఓ దొంగ. ఈ సంఘటన మెదక్ జిల్లా నార్సింగిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్ షాపులో దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్నాడు దొంగ. ఇక దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులో అక్కడే నిద్రపోయాడు. ఇక ఉదయం వైన్ షాపు తెరిచి చూడగా నిద్రపోతూ పట్టుబడ్డాడు ఆ దొంగ. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. అతన్ని మందలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
వైన్ షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి అక్కడే పడుకున్న దొంగ
మెదక్ – నార్సింగిలోని కనకదుర్గ వైన్ షాపులో దొంగతనానికి వచ్చి కౌంటర్లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ
దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులో అక్కడే నిద్రపోయిన వైనం
వైన్… pic.twitter.com/WUMvkNaamH
— Telugu Scribe (@TeluguScribe) December 31, 2024