రాష్ట్రంలో ఇందిరమ్మ ఆత్మయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ సర్కార్ విధివిధానాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 55లక్షల జాబ్ కార్డులు ఉండగా, అందులో 29 లక్షల మందికి ఎటువంటి భూమి లేదని తెలుస్తోంది.
ఇందులో ఒకరోజు పనిచేసిన వారు 15 లక్షలు ఉండగా, 10 రోజులు పనిచేసిన వారు 10 లక్షల మంది ఉన్నారు.వీరిని మినహాయించి కనీసం 20 రోజులు పైనా పనిచేసిన వారు 10 లక్షలు ఉన్నారు.వీరికి ఏడాదికి రూ.12,000 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం. దీనికి గాను ఏడాదికి రూ.1,200 కోట్లు తెలంగాణ ప్రభుత్వం వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, మొత్తం 55 జాబ్ కార్డులు ఉండగా.. అందులో దాదాపు 20 శాతం మందికే ఆత్మీయ భరోసా అందనుందని తెలుస్తోంది.