ల‌వ‌ర్ కోసం అక్క ఇంటికే చెల్లెలి క‌న్నం…

-

చెల్ల‌లే క‌దా అని…ఇంటిదాకా ర‌మ్మంటే…ఇంటిని గుల్ల చేసి వెళ్లింది. ప్రియుడి ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి అక్క ఇంటిలోనే దొంగ‌త‌నానికి పాల్ప‌డింది ఓ చెల్లి. అయితే చివ‌రికి పోలీసుల‌కు చిక్కి తీవ్ర అవ‌మాన భారాన్ని మూట‌గ‌ట్టుకుంది. ప్రియుడు అతుడి స్నేహితుడు మాత్రం ఊచ‌లు లెక్క‌పెట్టాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ఈ ల‌వ్ అండ్ రాబ‌రీ సంఘ‌ట‌న పదిరోజుల క్రితం పీర్జాదిగూడ నగరపాలకసంస్థ పరిధిలోని బుద్ధానగర్‌లో జ‌రిగింది. అయితే ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతపురానికి చెందిన మెండు ఝాన్సీ (20) ఇంటర్ వ‌ర‌కు చ‌దువుకుంది.

కుటుంబ ఆర్థిక ప‌రిస్థితులు బాగోలేక‌పోవ‌డంతో హైద‌రాబాద్‌లోని రామంతాపూర్ ఇందిరానగర్‌లో ఉంటూ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు యువ‌తికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బింగి రాహుల్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి ప్రేమ‌గా మారింది. అయితే త‌న‌కు కొంత డబ్బు అవసరం ఉందని రాహుల్ చెప్పిన మాయ‌మాట‌ల‌కు ప‌డిపోయిన ఝాన్సీ ఏకంగా త‌న ఇంట్లోనే దొంగ‌త‌నానికి స్కెచ్ వేసింది. ముందుగా అనుకున్న ప్ర‌కారం ఏది మాములుగా తాను ఇంటికి వ‌స్తున్న‌ట్లుగా పీర్జాదిగూడ నగరపాలకసంస్థ పరిధిలోని బుద్ధానగర్‌లో నివాసం ఉంటున్న త‌న అక్క స్వాతి ఇంటికి వెళ్లింది.

బీరువాలో స్వాతి న‌గ‌లు స‌ర్దుకోడాన్ని గ‌మ‌నించిన ఝాన్సీ క‌న్ను వాటిమీద ప‌డింది. ఇంటి ప‌నిలో స్వాతి నిమ‌గ్న‌మై ఉండ‌గా ఆ న‌గ‌ల‌ను ఝాన్సీ దొంగ‌లించి త‌న బ్యాగులో వేసుకుంది. ఏమీ తెలియ‌ని దానికి మ‌ల్లే అక్క‌డ నుంచి మెల్ల‌గా జారుకుని ఆ న‌గ‌ల‌ను ప్రియుడికి..అత‌డి స్నేహితుడికి అంద‌జేసింది. న‌గ‌లు చోరీకి గురైన సంఘ‌ట‌న‌ను ఆల‌స్యంగా గుర్తించిన స్వాతి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. అనుమానంతో ఝాన్సీని అదుపులోకి తీసుకుని విచారించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. ప్రియుడు అత‌డి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version