సికింద్రాబాద్ లో దారుణం : నాలుగు రోజులు మహిళపై అత్యాచారం.. కిడ్నాప్ చేసి మరీ!

-

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో తనను కిడ్నాప్ చేసి నాలుగైదు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళ చిలకల గూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ వచ్చింది. తన బావ చికిత్స కోసం ఈ నెల 4వ తేదీన గాంధీలో చేరగా.. అక్కడ సిబ్బంది తనపై అత్యాచారం చేశారంటూ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లింది ఆ బాధిత మహిళ. తన అక్కను.. తనను గదిలో బంధించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఆ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

తాను తప్పించుకుని బయటపడ్డానని, తన అక్క ఆచూకీ తెలియడం లేదంటూ ఆవేదన ఆవేదన వ్యక్తం చేసింది. మొదట మహబూబ్ నగర్ జిల్లా వన్ టౌన్ పి ఎస్ కు వెళ్లానని పేర్కొన్న ఆ మహిళ.. కొందరి సహాయంతో.. హైదరాబాద్ చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వచ్చానని స్పష్టం చేసింది ఆ మహిళ. ఉమ మహేశ్వర్ అనే గాంధీ ల్యాబ్ టెక్నీషియన్ తనను అత్యాచారం చేశాడని చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version