కరోనా వైరస్ సమయంలో ఏం చేయాలన్న భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మన రోజు వండుకునే ఆహారాన్ని తాకాలంటే కూడా పది సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మార్కెట్ నుంచి తీసుకు వచ్చిన కూరగాయలను.. తాకాలా వద్దా .. వాటిపై కరోనా వైరస్ ఉంటుందా.. మరి కూరగాయలు శుభ్రం చేయడం ఎలా..? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యువకుడు కూరగాయలను శానిటైస్ చేసేందుకు వినూత్నంగా ఆలోచించాడు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐఏఎస్ అధికారి ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే యువకుడు చేసింది పెద్ద పనేమీ కాదు మన చేతుల్లోని పనే.. ప్రెజర్ కుక్కర్ విజిల్ కు ఓ పైపు తొడిగి మరో చివరన కూరగాయలను ఉంచడమే. సహజమైన పద్ధతులో కూరగాయల మీద వేడి ఆవిరి పడి అవి శానిటైస్ అయిపోతాయి. అయితే ఇది కాస్త ప్రమాదకరమని అందుకే సబ్బు నీళ్లతో కూరగాయలను కడిగితే సరిపోతుందని ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.