తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకున్న మహిళ.. చివరికి ఇలా..!

-

ఒక భార్య తన తొమ్మిదో భర్త చేసితో దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంటుంది. అవును మీరు విన్నది నిజమే.. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కీచకురాలు.. బట్టలు మార్చినంత తేలికగా మొగుళ్ళని మార్చేసింది. ఒక భర్తతో గొడవపడి విడిపోయి వెంటనే మరొకరిని పెళ్లి చేసుకునేది. అలా ఏకంగా తొమ్మిది పెళ్ళిళ్ళు చేసుకుంది. చివరికి ఆ తొమ్మిదో భర్త చేతిలోనే హత్యకు గురైంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపల్‌ పరిధి శ్రీరామకాలనీలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేసే వరలక్ష్మితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది.

అయితే అప్పటికే ఆమెకు భర్త, బాబు ఉన్నారు. కాని, నాగరాజుపై ప్రేమతో కుటుంబాన్ని వదిలేసి అతడిని పెళ్లి చేసుకుంది. మొదట్లో వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వతే సదరు మహిళకు కొత్త కొత్త కోరికలు పుట్టుకొచ్చాయి. దీంతో పరాయి వ్యక్తులతో సన్నిహితంగా ఉంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడంతో నాగరాజు ఆవేశంతో ఆమె గొంతు కోసేశాడు. తీవ్ర రక్తస్రావంతో వరలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version