రూమ్‌మెట్‌ స్నానం చేయడం లేదని ఇంట్లోంచి గెంటేసిన యువతి..!!

-

జనరల్‌గా అమ్మాయిలకు రెడీ అవడం మీద ఉన్న శ్రద్ధ రోజూ స్నానం చేయడం మీద ఉండదు. అదొక బద్ధకం..ఎంత బద్ధకం అయినా.. ఒకరోజు రెండు రోజులు.. అంతకు మించి అయితే ఎవరూ ఉండరు. ఇంట్లో అయితే ఏం కాదులే కానీ.. హాస్టల్‌లో, రూమ్స్‌లో ఉండే వాళ్లు అయితే కచ్చితంగా శుభ్రంగా ఉండాలి. లేకపోతే.. చుట్టుపక్కల వారు మనల్ని అస్యహించుకుంటారు. అలాంటిదే ఇప్పుడు జరిగింది. రూమ్‌మెట్‌ స్నానం చేయడం లేదని ఓ అమ్మాయి ఆ రూమ్‌మెట్‌ను ఇంట్లోంచి గెంటేసింది. ఆమె ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా వార్తకాస్తా వైరల్‌ అయింది.. ఆమె పోస్ట్‌లో ఏం రాసిందంటే..!!
ఒక ఫ్లాట్‌లో కలిసి ఉంటున్న అమ్మాయి స్నానం చేయడం లేదని, వ్యక్తిగత శుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం చేస్తుంటే, ఆమె నుంచి వచ్చే కంపును భరించలేక మరో అమ్మాయి రూమ్ నుంచి బయటకు గెంటేసింది. ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం తన రూంమేట్ గత 4నెలలుగా స్నానం చేయడం లేదని తెలిపింది. ఒక రెడ్డిట్ పోస్టులో ఆవేశంతో ఊగిపోతూ ఓ 23 ఏళ్ల యువతి వ్యక్తిగత శుభ్రత పాటించని తన రూంమేట్‌తో తను పడ్డ ఇబ్బందుల గురించి ఇలా రాసింది. ఆమె రోజు 2 గంటలు జాగింగ్‌కు వెళ్లి వచ్చినా, ఏ రోజు కూడా స్నానం చెయ్యలేదని, దాని వల్ల ఫ్లాట్ అంత దుర్వాసన వచ్చేదని తెలిపింది.
ఆమె ఏం చెప్పిందే ఆమె మాటల్లోనే.. “నేను ఆ అమ్మాయితో నాలుగు నెలలుగా కలిసి ఉంటున్నాను, ఆమెకి వ్యక్తిగత శుభ్రతపై ఎలాంటి శ్రద్ధ లేదు, నేను ఇంకా ఆమెతో కలిసి ఉండలేను. ఆమె అసలు స్నానం కూడా చెయ్యదు. గత నాలుగు నెలల్లో ఒక్క సారి కూడా స్నానం చేయలేదు. రోజు రెండు గంటలు జాగింగ్ కు వెళ్లి వచ్చిన స్నానం చెయ్యదు. ఆ దుర్వాసనను నేను ఇంక భరించలేను. దాని వల్ల నేను అనారోగ్యానికి గురి అవుతున్నాను. ఈ విషయం గురించి ఆమెతో మాట్లాడితే నేను చేస్తా అని చెప్పడం తప్ప ఎప్పుడు చెయ్యలేదు. ఎన్ని సార్లు చెప్పిన పెడచెవిన పెడుతుంది.
23 ఏళ్ల ఓ యువతి 18 ఏళ్ల మరో యువతితో కలిసి ఓ రూమ్‌లో ఉంటుందని రెడ్డిట్ పోస్టులో తెలిపింది. అయితే గత నాలుగు నెలలుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఆ యువతి పరిశుభ్రత పాటించడం లేదని..ఆ ఫ్లాట్‌కు వచ్చిన యజమానికి ఆ వాసన ద్వారా అర్ధం అయ్యింది. అతను ఆ అమ్మాయి ని తనకు ముప్పై రోజుల సమయం వెళ్ళిపోవడానికి ఇస్తున్నానని లేదంటే బలవంతంగా గెంటేస్తా అని చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా రూమ్ మేట్ వినిపించుకోలేదని, ఆ వాసన, కంపు భరించలేక ఈ అమ్మాయి తన రూంమేట్‌ను బలవంతంగా గెంటివేసింది. అయినా ఆమె అసలు ఎలా ఉంటుందబ్బా..! మరీ నాలుగు నెలల నుంచి అంటే ఆలోచించాల్సిన విషయమే..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version