“ఆడవాళ్లు మీకు జోహార్లు” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..గెస్టులుగా ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు

-

శర్వానంద్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న తాజా సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ ఈ రొమాంటిక్ మూవీ కు తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో కుష్బూ, సీనియర్ నటి రాధిక అలాగే ఊర్వశి లాంటి సీనియర్ హీరోయిన్స్ అందరూ నటిస్తున్నారు.

మొత్తానికి ఈ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా రొమాంటిక్ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన, పోస్టర్లు, సాంగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముహుర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ నెల 27 వ తేదీన శిల్ప కళా వేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను జరుపాలని నిర్ణయం తీసుకుంది.అంతేకాదు.. సాయి పల్లవి, కీర్తి సురేష్‌, సుకుమార్‌ ఈ ఈవెంట్‌ కు స్పెషల్ గెస్టులుగా రానున్నారు. ఈ మేరకు ఓ పోస్టరు కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version