ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపెడుతోంది. ఇప్పటికే నిన్న కొన్ని దేశాల్లో స్టాక్ ఎక్సెంజీలు కుప్పకూలాయి. లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. ఇదిలా ఉంటే రానున్న కాలంలో మరిన్ని వస్తువులపై ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆసియా దేశాలకు ఎక్కువగా ముడి చమురు రష్యా నుంచి దిగుమతి అవుతుంది. యుద్ధ ప్రభావంతో క్రూడాయిల్ బ్యారెల్ రేటు 103 డాలర్లకు చేరింది. త్వరలోనే ఇది 120 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే జరిగితే.. భారత్ తో పెట్రోల్ రేట్లు భగ్గుమనే అవకాశం ఉంది. భారత్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 150కి చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాలను తగ్గించుకుంటే తప్పితే.. ధరలు తగ్గే అవకాశం లేదు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ నుంచి ఇండియాకు భారీగా సన్ ఫ్లవర్ దిగుమతి జరుగుతోంది. రానున్న రోజుల్లో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా చుక్కలను అంటే ప్రమాదం ఉంది. బార్లీ, గోధుమల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.