ఎన్నికల్లో దొంగ ఓట్లను చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది. దేశంలో ఉన్న ఓటర్ జాబితా కు ఆధార్ కార్డు ను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దాని కోసం పార్లమెంటు బిల్లు ప్రవేశ పెట్టనుంది. ముందుగా నేడు లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అయితే ఈ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందితే.. రాజ్యసభలోకి వెళ్తుంది. రాజ్య సభలో కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది.
రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఆ బిల్లు చట్టం గా మారుతుంది. దీంతో దేశ వ్యాప్తం గా డూప్లికేట్ ఓట్లను తొలగించడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త గా ఓటు నమోదు చేసుకునే వారి నుంచి ఆధార్ కార్డ్ ను తీసుకుని ఓటర్ కార్డుకు లింక్ చేస్తారు. అలాగే ఇప్పటి వరకు ఓటర్ కార్డు ఉన్న వారి నుంచి కూడా ఆధార్ కార్డ్ ను తీసుకుని లింక్ చేస్తారు. దీంతో ఎవరికైనా.. ఒకటి కన్న ఎక్కువ చోట్ల ఓటు వినియోగించుకోవడానికి గుర్తింపు ఉంటే వాటిని తొలగిస్తారు. దీంతో డూప్లికేట్ ఓట్లు పూర్తి గా తొలగిపోతాయి.