ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే విషయం తెలిసిందే. దీనిని ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరింత మెరుగు పరిచారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందడంతో పాటు వారిని క్షేమంగా ఇంటికి చేర్చడం కోసం చార్జీలకు కూడా డబ్బులు ఇచ్చారు.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్యారోగ్య శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి విడదల రజినీ ఆరోపించారు. ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీ గా మార్చిందని మండిపడ్డారు. 104, 108 సేవలను అటకెక్కించారని.. మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేశారని తెలిపారు. జగన్ హయాంలో ఏపీ మెడికల్ హబ్ గా మారింది. గ్రామాల్లోకి స్పెషలిస్ట్ డాక్టర్లను పంపించి పేదలకు వైద్యం అందించినట్టు తెలిపారు. కానీ వైసీపీ పై కూటమి సర్కార్ బుదర జల్లుతుందని ఫైర్ అయ్యారు విడదల రజిని.