BRS పార్టీ బరితెగించింది : ఆది శ్రీనివాస్

-

BRS పార్టీ బరితెగించి ముందుకు పోతుంది అని ఆది శ్రీనివాస్ అన్నారు. తెరాస పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాం. సోషల్ మీడియాలో జిల్లా కలెక్టర్ మీద అనేక ఆరోపణ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని 1000 ఎకరాల భూముల ఆక్రమణకు గురైంది, వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు వ్యక్తిగత జీవితం గురించి చూస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ లో మీరు వ్యక్తిగతంగా సినిమా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడలేదా. కలెక్టర్ పై ఎలాంటి కేసు లేదని నేను ఇవాళ మీడియాలో చూసాను. కలెక్టర్ పై కేసులు లేనప్పుడు వ్యక్తి గతంగా అవమాన పరిచినదుకు క్షమాపణ చెప్పాలి. ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా టీ పాయింట్ ఫ్లెక్స్ లో కేటీఆర్ ఉంటే తొలగించినందుకు కలెక్టర్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పదేళ్ల అవినీతి అక్రమ పాలనలో అనేకమంది మా కార్యకర్తలపై కేసులు నమోదు చేసినా భయపడలేదు. ఐపీఎస్, ఐపీఎస్ ఆధికారులకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. డబుల్ బెడ్రూం లో జరిగిన అవినీతిని బయట తీస్తున్నందుకు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా BRS పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలి అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version