బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారు. బీసీ లతో అసలు కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీ లపైన ముసలి కన్నీరు, కపట ప్రేమ కవిత చూపిస్తోంది. బీసీ ల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముంది. సమస్యల పరిష్కారం కోసం పోరాడే శక్తి బీసీలకు ఉంది. బీసీ నాయకత్వం లో సమస్యలను పరిష్కరించుకుంటాం. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో బీసీ ల సమస్యలను పరిష్కరించుకొనే కర్మ మాకు పట్టలేదు. కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదు.
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీ ల గురించి ఏనాడైనా కవిత మాట్లాడారా. అయినా దేశానికి కులగణన లో తెలంగాణ రోల్ మోడల్ గా మారింది. బీసీల కు స్థానిక సంస్థ ల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమే ధ్యేయంగా కులగణన జరిగింది. రాహుల్ గాంధీ సూచనలతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగణన చేపట్టారు. గిరిజనులు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ .. అప్పుడు బీసీ ల గురించి ఎందుకు మాట్లాడలేదు.. పదేళ్లలో బీసీ లను ఏనాడు పట్టించుకోలేదు.. ఏ కార్యక్రమాన్ని సరిగా అమలు చేయలేదు. బీసీ కార్పొరేషన్ తో పాటు ఇతర కార్పొరేషన్ల ను నిర్వీర్యం చేశారు. బీసీ కు రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. కానీ ఇప్పుడు గందరగోళాన్ని సృష్టించడం కోసం ఆమె డ్రామాలు ఆడుతున్నారు. కవిత నాయకత్వంలో జరిగే సభకు బీసీలు ఎవరూ హాజరు కావొద్దు. అగ్రకులాల చెప్పుచేతల్లో ఉద్యమాలు చేయాల్సిన కర్మ బీసీలకు లేదు. లిక్కర్ కేసు ను జనం దృష్టి మళ్లించడానికి కవిత బీసీ డ్రామాలు ఆడుతోంది ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.