ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మంచి హీటుమీద ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్ లకు ఇంకా సంవత్సరం కన్నా తక్కువగా సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు అన్నీ తమ వ్యూహాలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ రాష్ట్రంలో పెరిగిపోయిన ధరలను ఉద్దేశించి ఈ రోజు నెల్లూరు దర్గామిట్ట దగ్గరలోని కరెంటు ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కట్టే పన్నులనే వారికి పెన్షన్ రూపంలో ఇస్తున్నారు, అంతేకాని సీఎం జగన్ నాన్న జేబులోంచి తెచ్చి ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు.
సీఎం జగన్ పై విరుచుకుపడ్డ నెల్లూరు టీడీపీ అధ్యక్షుడు !
-