బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతూ షాకింగ్ కామెంట్స్ చేసిన అభినయశ్రీ..!

-

బిగ్ బాస్ సీజన్ 6 మొదలైన తర్వాత మొదటి వారం ఎలిమినేషన్ ను ఆపివేశారు. ఇక రెండవ వారం డబుల్ ఎలిమినేషన్ పేరిట షాని, అభినయశ్రీని ఇద్దరినీ కూడా హౌస్ నుంచి పంపించడం జరిగింది. ఇకపోతే నాగార్జున పెట్టిన గజిబిజి గానా టాస్క్ కూడా ప్రేక్షకులను మెప్పించ లేకపోయింది. ఇక అభినయ శ్రీ ఎలిమినేషన్ తర్వాత ఆమె చేసిన కామెంట్లు కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఆదిరెడ్డి, అభినయ శ్రీ చివరికి మిగిలారు. అభినయ ఎలిమినేట్ అయిందని నాగార్జున చెప్పేసాడు. దీంతో గీతూ ఎగురుకుంటూ వచ్చి ఆదిరెడ్డికి కంగ్రాట్స్ చెప్పింది.. నాకు ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని శ్రీ సత్య అంటే , అందుకే ఎవరిని ఇష్టపడకు అని చెబుతుంది. ఇక ఆది రెడ్డి ఎలిమినేట్ అయితే నేను చాలా బాధపడేదాన్ని అని కూడా చెప్పింది గీతూ..

ఇక స్టేజ్ మీదకు వచ్చిన అభినయ శ్రీ ఇంత త్వరగా నా ఆడియన్స్ నన్ను బయటకు పంపిస్తారని అనుకోలేదు అంటుంది. అప్పుడు స్టేజ్ మీదకు వచ్చిన అభినయకు నాగార్జున ఒక టాస్క్ ఇస్తాడు. ఇంట్లో హానెస్ట్ గా ఉన్న ఐదుగురు, హానెస్ట్ గా లేని ఐదుగురు పేర్లను చెప్పమని చెబుతాడు.. హానెస్ట్ గా ఉండే క్యాటగిరీలో ఫైమా, శ్రీ సత్య , చంటి, బాలాదిత్య , సూర్య పేర్లు చెబుతుంది.. ఫైమా కు పెద్ద ఫ్యాన్ .. షటప్ అనే రీలు నేను కొన్ని వందలసార్లు చూశాను.. చెల్లిలా కనెక్ట్ అయ్యింది.. చాలా హానెస్ట్ .. కావాలని ఎవరిని కూడా బాధ పెట్టదు. జాలీగా ఉండే క్యారెక్టర్.. నేను హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఆమె అని ఫైమా గురించి గొప్పగా చెప్పింది. ఇక చంటి నాకు అన్నయ్య లాంటి వాడు అంటూ అందరి గురించి బాగా చెప్పిన ఈమె డిస్ హానేస్ట్ గురించి రేవంత్ పేరు మాత్రమే చెప్పింది. ఆట మధ్యలో పర్సనల్ విషయాలు చెబుతాడు అది నాకు నచ్చలేదు. నువ్వు కన్నింగ్ లా అనిపిస్తున్నావని ఆయన మొహం మీదే చెప్పాను అంటూ అభినయ చెబుతుంది. ఇక గీతూ డిస్ హనేస్ట్ కాదు అని, కానీ టాప్ 3 లో ఆమె ఉంటుంది. చాలా బ్రేవ్ అని కూడా చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version