ఏపీలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌వే !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్న సంగతి తెలిసిందే. అయితే… ఏపీలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ వే ఉంటున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జోనోమ్‌ సీక్వెన్సింగ్‌ కు వస్తున్న శాంపిల్స్‌ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ap carona

ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. వైరస్‌ సోకితే.. ఎదురయ్యే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకుని.. అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 13,212 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,53, 268 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో ఐదుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 532 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64, 136 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version