ఈఎస్‌ఐ స్కామ్ లో అభియోగాలు ఎదుర్కుంటు అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏసీబీ కోర్టు చేదు వార్త వినిపించింది. ఆయన ధాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. అయితే అచ్చెన్నాయుడు కొన్ని రోజుల క్రితమే బెయిల్ ను మంజూరు చేయండి అంటూ పిటిషన్ వేశారు కానీ అప్పుడు రాష్ట్రంలో కరోనా నేపద్యంలో కోర్టుకు సెలవులు ఉండటంతో కోర్టు ఆయన పిటిషన్ ను వాయిదా వేసింది. కాగా నేడు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పై ఇరు వైపులా వాదనలు విన్న కోర్టు అచ్చెన్నాయుడి తరఫు వాదనల పై అంతా మొగ్గు చూపలేదు.
అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగోలేదని దైనందిన కృత్యాలు తీర్చుకునేందుకు కూడా వీలుకాని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించాడు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కావాలంటే ఆయన బదులు కోర్టు ఎప్పుడు పిలిచినా తాము హాజరవుతామని ఆయన తరఫు న్యాయవాధి అన్నారు. ఇక డిఫెన్స్ న్యాయవాది అదంతా అవాస్తవం అని అచ్చెన్నాయుడికి పూర్తిస్థాయిలో చికిత్స జరిగిందని, మెరుగైన వైద్యం అందించామని వెల్లడించారు. మరే ఇతర వైద్యం అవసరంలేదని వాదించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్ పై తీర్పును రేపు ప్రకటిస్తుంది.