ఘోర విషాదం.. 12మంది శిశువులతో సహా 24 మంది మృతి

-

మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 12 మంది శిశువులతో పాటు ఏకంగా 24 మంది చనిపోయారు. వీరందరూ సరైన మందులు అందకనే చనిపోయారు. నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో గత 24 గంటల్లో ఆరుగురు మగ, ఆరుగురు ఆడ శిశువులు, 12 మంది రోగులు మృత్యు వాతపడ్డారు. వీరికి సకాలంలో మందులు అందకనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి డీన్ శంకర్ రావ్ చవాన్ తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో పెనుదుమారం చెలరేగుతోంది. ఈ మరణాలు దురదృష్ణకరమని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు.

ఆస్పత్రిలో ఏం జరిగిందనే దానిపై మరింత సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహరాష్ట్రలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్( బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ)పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది విషమంగా ఉన్నారు. వైద్య సదుపాయాలు సిబ్బంది కొరత ఉందని, చాలా మంది నర్సులను బదిలీ చేశారని, ఖాళీలను భర్తీ చేయలేదని మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు. ఈ మరణాలకు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ బాధ్యత వహించాలని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version