హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి !

-

హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ట్యాoకర్ ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఉస్మానియకు తరలించారు. తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగిందని అంటున్నారు.

హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందిన కే.కల్యాణ చక్రవర్తి, కే.సత్యనారాయణ,లు అక్కడికక్కడే మృతి చెందగా హంస ప్రియ,శారదల పరిస్థితి విషమంగా ఉంది. రఘునందన్ అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. తిమ్మాపూర్ వద్ద యాంకర్ యూ టర్న్ తీసుకుంటుండగా  i20 కారు వేగంగా వచ్చి గుద్దు కోవడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారి. ఇక ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. కొత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version