ఎలాంటి వ్య‌క్తినైనా ఇట్టే మ‌న దారిలోకి రావాలంటే.. చాణక్యుడు చెప్పిన హిప్నోటిజం ట్రిక్స్

-

ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలను పాటిస్తే ఎలాంటి మనస్తత్వం  కలవారినైనా ఇట్టే మన దారిలోకి తెచ్చుకోవాచ్చట. ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. లక్షణాలు, ప్రవర్తన వ్యక్తిని బట్టీ మారుతూ ఉంటాయి. ప్ర‌పంచంలో ఏ ఇద్ద‌రు మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు కూడా ఒకే రకంగా కలిగి ఉండరు.

ఈ క్ర‌మంలో ఏ వ్య‌క్తినైనా మ‌న దారి లోకి తెచ్చుకోవాలంటే అది చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌నే అవుతుంది.  అయితే ఒక నిర్దిష్ట‌మైన వ్య‌క్తిత్వం ఉన్న వారిని మాత్రం ఇట్టే మ‌న దారికి తెచ్చుకోవ‌చ్చ‌ట‌. అందుకోసం ఆచార్య చాణ‌క్యుడు ప‌లు విష‌యాల‌ను తెలియ‌జేశారు. అవేమిటంటే…

కోపంగా ఉన్న వారినైతే…

ఇలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న వారి ఎదుట చాలా మ‌ర్యాదగా, ప్ర‌శాంతంగా ప్ర‌వ‌ర్తించాలి. ఎల్ల‌ప్పుడూ కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు. దీంతో వారు ఆటోమేటిక్‌గా కూల్ అయి కొంత శాంతి చెందుతారు. ఆ క్ర‌మంలో మ‌న దారికి వ‌స్తారు.

మూర్ఖుల‌నైతే…

మూర్ఖ‌పు స్వ‌భావం ఉన్న వారిని ఎల్ల‌ప్పుడూ పొగుడుతూ ఉండాల‌ట‌. వారినే ఎల్ల‌ప్పుడూ ఫాలో కావాల‌ట‌. దీంతో వారు ఆటోమేటిక్‌గా కంట్రోల్‌లోకి వ‌చ్చేస్తార‌ట‌.

ప్రతిభావంతులైతే…

ఒక వేళ మ‌న ఎదుట మ‌న‌క‌న్నా ప్ర‌తిభావంతులైన వ్య‌క్తులు ఉంటే వారితో ఎల్ల‌ప్పుడూ నిజాలే మాట్లాడాల‌ట‌. దీంతో వారు మ‌న ప‌ట్ల ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ మ‌న దారిలోకి వ‌స్తారు.

ఈగో ఉన్న‌వారు…

బాగా ఈగో మ‌న‌స్త‌త్వం ఉన్న వారిని మ‌న దారిలోకి తెచ్చుకోవాలంటే వారితో ఎల్ల‌ప్పుడూ మ‌ర్యాదగా ఉంటూ, అదేవిధంగా ప్ర‌వ‌ర్తించాలి. దీంతో వారు ఆటోమేటిక్‌గా మ‌న మాట వింటారు

స్వార్థం ఉన్న వారు, అత్యాశాప‌రులు…

ఇలాంటి వారిని సుల‌భంగా బుట్టలో ప‌డేయ‌వ‌చ్చు. వీరికి కొంత ధ‌నం ఆశ చూపితే చాలు, మ‌న దారిలోకి వ‌చ్చేస్తారు.

పిల్ల‌లు…

చిన్న పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల‌తో లొంగ‌దీసుకోవ‌చ్చు. 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌ర‌కు వారిని అమిత‌మైన గారాబంగా, ప్రేమ‌తో పెంచాలి. అదే 10 ఏళ్ల లోపు వారైతే వారితో ఎలాంటి దురుసు ప్ర‌వ‌ర్త‌న చేయ‌కూడ‌దు. ఇక 16 ఏళ్ల లోపు వారు, ఆపైన వారితోనైతే త‌ల్లిదండ్రులు స్నేహితుల్లా మెల‌గాల్సి ఉంటుంది.

క్లిష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితులు వ‌స్తే…

పైన చెప్పిన మ‌న‌స్త‌త్వాలు ఉన్న వ్య‌క్తుల‌తోనే కాదు, ఆయా సంద‌ర్భాల్లో ఎలా ప్ర‌వ‌ర్తించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. ప్ర‌ధానంగా చాలా క్లిష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితులు ఉన్న‌ప్పుడు వీలైనంత ఓర్పుతో ఉండాలట‌. అదే మంచి ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ట‌.

ఒక వ్య‌క్తి స‌హ‌జ‌మైన స్వ‌భావాన్ని తెలుసుకోవాలంటే…

ఒక వ్య‌క్తికి ఉన్న‌టువంటి స‌హ‌జ‌సిద్ధ‌మైన అత‌ని స్వ‌భావాన్ని తెలుసుకోవాలంటే అత‌ని మాట‌లు, ప్ర‌వ‌ర్త‌న ఆధారంగా దాన్ని నిర్ణయించ‌వ‌చ్చ‌ట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version