ఆచార్య స్పీక్స్ నౌ : విప్ల‌వాల నేల ధ‌ర్మ స్థ‌లి చెబుతున్న‌ది ఇదే !

-

సామాజిక క‌థ‌కుడు అని రాయాలి
ఒప్పుకుంటారో లేదో కానీ
బాధ్య‌త నిండుగా తెలిసిన వ్య‌క్తి
నిశ్శ‌బ్దావ‌రణ‌లో త‌న ప‌నేంటో తాను
అని భావించే వ్య‌క్తి
డైలాగ్ కు ఏం కావాలో అంతే
సినిమా కు ఏం కావాలో అంతే
ఎదురుగా చిరు.. ఎదురుగా మెగాస్టార్ అయినా స‌రే !
తానేం చెప్పినా వినే చిరు.. ఏం చేయాల‌న్న సిద్ధంగా ఉండే చ‌ర‌ణ్
ఇప్పుడు అత‌డి జీవితం గుంటూరులో చ‌దివిన పుస్త‌కం
ఇప్పుడు అత‌డి జీవితం భాగ్య‌న‌గ‌రి దారుల్లో మార్చి రాసిన పుస్త‌కం
అవును ! అడ‌విలో పుట్టిన క‌థ.. ఆచార్య.. మ‌న‌తో మాట్లాడ‌తాడు త్వ‌ర‌లో. సామాజిక రీతుల‌ను వివ‌రిస్తూ కొన్ని జాడ్యాల‌ను ప్ర‌శ్నించేందుకు సిద్ధం అవుతున్నాడు. వెల్కం స‌ర్.. వెల్కం.

గొప్ప క‌థ‌కు గొప్ప క‌థ‌నం తోడుగా ఉండాలి. ఉంటుంది కూడా ! మంచి స్నేహం అంటే ఇదే ! ల‌క్ష‌ణం తెలిశాక క‌థ చెప్ప‌డం సులువు. నేప‌థ్యం నిర్ణ‌యించుకుని క‌థ రాయ‌డం ఓ పద్ధ‌తి. కొరటాల శివ క‌థ‌ల‌కు స్ప‌ష్ట‌మ‌యిన నేప‌థ్యం ఉంటుంది. ఆ నేప‌థ్య రీతుల‌కు అనుగుణంగా క‌థ మ‌రియు క‌థ‌నం కూడా ఉంటాయి. తోడు ఉంటాయి. అని చెప్పాను క‌దా అదే ఇది. ప్ర‌కృష్ట రీతిలో ఆయ‌న క‌థ ఉండేందుకు కొన్ని ల‌క్ష‌ణాలు అందుకునే ఉంటుంది. ఆ విధంగా చిరు న‌టించిన ఆచార్య.. చ‌ర‌ణ్ మెరిసిన ఆచార్య..అందాల నీలాంబ‌రిగా పూజ న‌టించిన ఆచార్య కొద్ది గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఆచార్య సినిమాకు ఓ విప్ల‌వ నేప‌థ్యం ఉంది. ఆ మాట‌కు వ‌స్తే శ్రీ‌మంతుడు కూడా ఓ సామాజిక విప్ల‌వ గాధ. అందుకే ఆయ‌న్ను ఉద్దేశించి ఓ మాట అంటారు క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్ తెలిసిన క‌థ‌కుడు.. సామాజిక క‌థ‌కుడు అని అంటారు. అవును ! ఈ మిర్చి లాంటి కుర్రోడు కేవ‌లం త‌న క‌థ‌ను సింగిల్ లైన‌ర్ లో చెబుతారు. ఆర్టిస్టిక్ వ్యూ ను అర్థం చేసుకుంటారు. క‌థ‌లో ఫ్లేవ‌ర్ ను ఎక్క‌డికి పోనివ్వ‌రు. అతి ఉండ‌దు. చ‌రణ్ ఎంత గొప్ప‌గా చెప్పాడు. ఆయ‌న సినిమాల్లో హీరో మ‌న‌సులో ఓ బుద్ధుడు, ఓ వివేకానందుడు ఉంటాడు. వాళ్లే ఆయ‌న్ను న‌డిపిస్తారు. క‌థ‌ను ప్ర‌ధానంగా న‌డిపే పాత్ర‌ల్లో ఆ హుందాత‌నం ఇప్ప‌టికీ అదేవిధంగా ఉంది.

ధ‌ర్మ స్థ‌లి ని నిర్మించాడు. ధ‌ర్మ‌పోరాటం చేయాల‌నుకుంటున్నాడు. అడ‌వి అత‌ని మాట వింటోంది. అడ‌వి వెంట జ‌నం అత‌ని వెంట న‌డుస్తున్నారు. ఆల‌యాల్లో జరిగే అక్ర‌మాలు, దేవాదాయ శాఖ‌లో జ‌రుగుతున్న అన్యాయాలు వీట‌న్నింటినీ క‌మ‌ర్షియ‌ల్ ఫ్లేవ‌ర్ లోనే చెబుతున్నారు. బాధ్య‌త తెలిసిన డైరెక్ట‌ర్.. ఆ విధంగా ఎంతో బాధ్య‌త‌గానే ఈ క‌ధను న‌డిపారు. అవును స‌ర్ ! నా హీరో హంబుల్ గా ఉంటాడు. సొసైటీని రెస్పెక్ట్ చేస్తాడు. వాల్యూస్ ఉంటాయి. అవి లేకుండా నాలోని క‌థ‌కుడి మ‌రో క‌థా నాయ‌కుడ్ని సృష్టించ‌లేడు అన్న అర్థం వ‌చ్చే విధంగా కొరటాల శివ అనే కుర్రాడు మ‌న‌తో మాట్లాడ‌తాడు. ఆచార్య‌తో ఎన్నో విష‌యాలు మాట్లాడిస్తున్నాడు. మ‌రో శ్రీ‌మంతుడు కావాలి. అంత గొప్ప‌గా ఈ సినిమా రావాలి అని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version