సినీ దర్శకుడు వీవీ వినాయక్ అనారోగ్యంతో ఉన్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తే చర్యలు తప్పవని ఆయన టీమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. దర్శకుడు వీవీ వినాయక్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం పై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం అని పేర్కొన్నారు.
‘ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా వున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలి అని మా మనవి.ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొనబడును. ఇట్లు
వీవీ వినాయక్ టీమ్’ అని రాసుకొచ్చారు.