పోలీసులకు దొరికిపోయిన నటుడు కమల్ కామరాజు.. ట్వీట్ వైరల్..!

నటుడు కమల్ కామరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోదావరి, ఆవకాయ బిర్యాని వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులకు దగ్గర అయిన ఈయన… చేసింది తక్కువ సినిమాలే అయినా మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు.. నిజానికి సినిమాలలో మాత్రమే కనిపిస్తూ వివాదాలకు దూరంగా ఉండే కమల్ కామరాజు సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. కేవలం తనకు అలాగే తన సినిమాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందించడానికి మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగిస్తారు.

అయితే కమల్ కామరాజు తాజాగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. నేను పోలీసులకు దొరికిపోయాను.. కటకటాల్లోకి వెళ్లాను అంటూ ఆయన చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నటిజెన్లు పోలీసులకు దొరకడం ఏంటి ? అసలు ఏం జరిగింది? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా కమల్ కామరాజు చేసిన ఈ ట్వీట్ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ…” అందరికీ చెప్తాను.. ఇవాళ నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయాను… పొద్దున్నే ఖాళీ రోడ్డు చూసి ఆత్రుత ఆపుకోలేక 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్నే నేను స్పీడ్ గా వెళ్లడాన్ని పట్టుకొని .. నాకు చలానా పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు.. వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు ధన్యవాదాలు.. అంటూ కమల్ కామరాజు తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

అంతే కాదు తాను బైక్ లో స్పీడ్ గా వెళ్తున్న ఫోటోలు కూడా షేర్ చేశాడు. ముఖ్యంగా పోలీసులు ఏర్పాటు చేసిన కెమెరాలలో ఈ ఫోటో క్యాప్చర్ అయిందని.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు కమల్ కామరాజు.

అందరికి చెప్తా… ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice @HYDTP pic.twitter.com/KSuP5rvkVM
— kamal kamaraju ~k k (@kamalkamaraju) January 19, 2023

Read more RELATED
Recommended to you

Exit mobile version