కరోనా మహమ్మారి ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. ఇప్పటికీ ఎంతో మంది ఆ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. ఆత్మీయులకు దూరమవుతూ కంట తడి పెట్టిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల దేశంలో వైద్య ఆరోగ్య రంగ పరిస్థితి ఎలా ఉందో మనకు ఇప్పటికి కళ్లకు కట్టినట్లు క్లియర్‌గా తెలుస్తోంది. జనాలు కోవిడ్‌తో కాదు, ప్రభుత్వాలు సదుపాయాలు అందించలేక చేతులెత్తేయడం వల్ల చనిపోతున్నారు. అందుకు ఈ నటుడి సంఘటనే ఉదాహరణ.
నటుడు, యూట్యూబర్ రాహుల్ వోహ్రా గత వారం కిందట కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో అతనికి ఢిల్లీలోని తాహిర్‌పూర్ లో ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో అతన్ని ద్వార్కాలో ఉన్న ఆయుష్మాన్ హాస్పిటల్‌కు మార్చారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో రాహుల్ తనకు మరణం తప్పదని గ్రహించి ఫేస్‌బుక్‌లో చివరి పోస్టు పెట్టాడు. ఆ పోస్టు అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
తనకు సరైన చికిత్స అందించి ఉంటే బతికే వాడినని రాహుల్ వోహ్రా తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నాడు. వచ్చే జన్మలో కలుస్తానని, అప్పుడు మంచి పనులు చేస్తానని, ఇప్పుడు ధైర్యం కోల్పోయానని అన్నాడు. ఇక ఆ పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు ట్యాగ్ చేశాడు. కాగా ఢిల్లీలో శనివారం ఒక్క రోజే 17,364 కొత్త కరోనా కేసులు నమోదు కాగా ఒక్క రోజులోనే 332 మంది చనిపోయారు.