అరుదైన గౌరవాన్ని అందుకున్న నటుడు షఫీ..!

-

ఒకప్పుడు తెలుగు సినిమాలంటే కేవలం తెలుగు పరిశ్రమకు మాత్రమే పరిమితం అయ్యేవి.కానీ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తూ ఉండడం గమనార్హం . ఇలా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాల సత్తా ఏంటో నిరూపించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత అతిపెద్ద ఎత్తున తెలుగులో విడుదల అయ్యే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో నటిస్తూ మంచి ఆదరణ సంపాదించుకున్న నటుడు షఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమా ద్వారా తన కెరియర్ ప్రారంభించిన షఫీ మొదటి సినిమాతోనే భారీ విజయాన్నీ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 50 సినిమాలకు పైగా నటించారు. ఈయన సినిమాలలో విలన్ గా నటించి భయపెట్టారు. ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలలో నటిస్తూ మెప్పించిన షఫీ కి తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది.

అదేమిటంటే చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల్లో ఒకటైన ” కెన్స్ ఫిలిం ఫెస్టివల్ ” లో ఉత్తమ నటుడు విభాగంలో నామినేట్ అయ్యారు షఫీ.తాజాగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అమిత్ వర్మ దర్శకత్వం వహించిన 3.15 AM షార్ట్ ఫిలింలో ఒక మధ్య వయసుకుడిగా నటించాడు . ఈ క్రమంలోనే కెన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడి విభాగంలో నామినేట్ అయ్యాడు.. షఫీ ఇలాంటి గౌరవాన్ని అందుకోవడంతో ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ప్రతిభావంతులైన నటులను గుర్తించి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ అమిత్ తో ఈ మూవీ చేసేటప్పుడు చాలా నేర్చుకున్నాము. ఈ సినిమాను షార్ట్ ఫిలిం కాకుండా పెద్ద ప్రాజెక్టుగా భావించి పనిచేసాము. కాబట్టి నేడు ఫలితం దక్కింది అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version