Keerthy Suresh : చీరకట్టులో మాయ చేస్తున్న కీర్తి.. ఫిదా అవుతున్న నెటిజన్లు

-

కీర్తి సురేశ్.. దసరా సినిమా సక్సెస్​ జోష్​లో ఉంది ఈ బ్యూటీ. ఆ మూవీ ఇచ్చిన కిక్​తో తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఇటీవల వరుస ఫ్లాప్​లతో సతమతమవుతున్న కీర్తికి దసరా బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయినా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే సక్సెస్ సాధించింది. మిగతా భాషల్లో అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా సాగాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, ముంబయి.. ఇలా పలు నగరాల్లో ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ చిత్ర ప్రచారం కోసం కీర్తి ట్రెడిషనల్ లుక్​ను ఎంచుకుంది. అందుకే ఎక్కువగా చీరకట్టులోనే కనిపించింది. అయితే దసరా మూవీ ప్రమోషన్స్​లో తనకు బాగా నచ్చిన తన అట్టైర్​ గురించి సోషల్ మీడియాలో కీర్తి తాజాగా పోస్టు చేసింది.

దసరా సినిమా ప్రమోషన్స్​లో నాకు బాగా నచ్చిన లుక్ అంటూ కీర్తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో కీర్తి చాక్లెట్ కలర్ శారీలో కనిపించింది. చీరకట్టులో కీర్తి చాలా అందంగా కనిపిస్తోంది. ఈ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version