అనవసరమైన వస్తువుల్ని పారేసినట్టే జీవితంలో అక్కర్లేని మనుషుల్ని కూడా వదిలేయాలి.. సదా

-

ఒంటరిగా బతకడం పెద్ద కష్టమేమీ కాదని, నిజానికి అనవసరమైన బంధాల్లో ఇరుక్కొని జీవితాలను నాశనం చేసుకునే కన్నా.. ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ మనతో మనం ఆనందంగా ఉండటం మేలని చెప్పుకొచ్చింది టాలీవుడ్ హీరోయిన్ సదా..

తన అందంతో అభినయంతో తెలుగు ప్రాక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్ సదా.. నితిన్ హీరోగా నటించిన
జయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.. వైవిధ్య పాత్రల్లో నటిస్తూ తన టాలెంట్ను నిరూపించుకున్న సదా.. అనుకోని పరిస్థితుల్లో సినిమాల నుంచి తప్పుకుంది. తర్వాత బుల్లితెరపై చాలా కార్యక్రమాలకు జడ్జిగా కనిపించిన ఈమె.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రమే ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.

నెట్ ఇంట్లో తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తున్న సదా నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.. మాంసాహార సంబంధిత పదార్థాలను తీసుకోకుండా కేవలం శాకాహార పదార్థాలని తీసుకుంటూ.. ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుంది.. అయితే సదా ఒంటరిగా ఎందుకు ఉండిపోయిందని ఈ విషయంపై అభిమానులు ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ నే ఉంటారు ఈ విషయంపై తాజాగా ఓ క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ.. జీవితంలో అనవసరమైన బంధాల్లో మునిగిపోయి బాధపడే కన్నా ప్రశాంతంగా ఒంటరి జీవితాన్ని బతకడం మేలని చెప్పుకొచ్చింది..

“జీవితంలో ఎప్పుడూ కూడా మనకు ఇష్టమైన వారిని ఎక్కడ దూరం చేసుకుంటామా అని బాధపడుతూ ఉంటాము.. అయితే కొన్నిసార్లు మనకు ఎంతో దగ్గరగా ఉన్నవారు కూడా మనల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు.. కేవలం మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే మనతో జీవితాంతం ఉండిపోతారు.. ఇంట్లో అక్కర్లేని వస్తువులను ఎలా అయితే తీసి బయట పడేస్తాము అలాగే జీవితంలో కూడా మనకు బాధ కలిగించే మనుషుల్ని దూరంగా ఉంచడం చాలా మంచిది.. కొందరి కోసం మనం ఎన్ని త్యాగాలు చేసిన వారికి ఎప్పటికీ గుర్తు ఉండదు.

మనం జీవితంలో ఎదగటానికి కూడా వాళ్ళు ఏమాత్రం సహకరించారు.. ఇంకా మన ఎదుగుదలకు అడ్డు వస్తూ ఉంటారు. అలాంటి వారిని జీవితం నుంచి దూరం చేసుకోవడం మంచిది. చుట్టూ ఉన్న మనుషులు అందరూ ఏదో ఒక రోజు మన నుంచి దూరంగా వెళ్లిపోతారు. కానీ మనం మాత్రమే మనతో ఉంటాం.. ఎప్పుడు మన అంతరాత్మ చెప్పే విషయాన్ని వినాలి. అనవసరమైన బంధాల్లో కష్టంగా జీవించే కన్నా వాటి నుండి బయటకు వచ్చి ప్రశాంతంగా బతకడం మంచిదని..” చెప్పుకొచ్చారు సదా..

Read more RELATED
Recommended to you

Exit mobile version