తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. నిన్నటి వరకు సీనియర్లు తమకు సముచిత గుర్తింపు దక్కడం లేదంటూ.. నేటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌ను బైకాట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మాజీ మంత్రి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు చేస్తున్నది పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని అన్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాను బహిరంగంగా మాట్లాడినప్పుడు పార్టీ క్రమశిక్షణ రాహిత్యం అంటూ నోటీసులు ఇచ్చారని.. ఇప్పుడు మాట్లాడిన వారికి నోటీసులు ఇవ్వరా అని అద్దంకి మండిపడ్డారు అద్దంకి దయాకర్. వాళ్లకు ఏమైనా కాంగ్రెస్ రాజ్యాంగం కొత్తగా ఉందా అని ఆరోపించారు. వలస పార్టీ అని ఐదారుగురు నిర్ణయిస్తారా? అని అద్దంకి దయాకర్ అన్నారు. తమకు రాజకీయ నేపథ్యం లేకున్నా పార్టీ కోసం పనిచేయడానికి వచ్చామన్నారు అద్దంకి దయాకర్.
పంచాయతీలు పెట్టుకునేందుకు ఇక్కడికి రాలేదని చెప్పారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసి తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని సీనియర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పంచాయితీని బయట పెడితే నష్టపోతారని చెప్పారు అద్దంకి దయాకర్. ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. బీఆర్ఎస్, బీజేపీపైన లేని కోపం తెలంగాణ కాంగ్రెస్ పై ఎందుకని ప్రశ్నించారు. అసలు రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శించాలని అద్దంకి దయాకర్ నిలదీశారు అద్దంకి దయాకర్.