మా వార్‌ రూంపై దాడి చేసి.. డేటా అంతా ఎత్తుకెళ్లారు : రేవంత్‌ రెడ్డి

-

టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం గాంధీ భవన్‌లో మూడు గంటలకుపైగా సాగింది. అయితే.. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కమిటీ మీటింగ్‌ను హైకమాండ్ ఆదేశాలతోనే నిర్వహించినట్లు రేవంత్ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రపై భేటీలో చర్చించినట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్‌ల నియామకం ఉంటుందన్నారు. కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు అవుతాయన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటివరకు 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు వివరించారు. మోదీ, కేసీఆర్ వైఫల్యాలను ఛార్జ్‌షీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యక్రమం తీసుకుంటున్నట్లు చెప్పారు. జనవరి 3,4 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. తాను చేపట్టే పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతానని రేవంత్ చెప్పారు. వార్ రూంపై దాడి చేసింది పోలీసులు కాదు, గూండాలని తమకు అనుమానంగా ఉందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ డేటాను దొంగల్లా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు, నిపుణులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని రేవంత్ ధ్వజమెత్తారు. ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version